శనివారం 30 మే 2020
National - Apr 08, 2020 , 01:21:43

లాక్‌డౌన్‌లోనూ ఆగని చొరబాట్లు

లాక్‌డౌన్‌లోనూ ఆగని చొరబాట్లు

  • యథేచ్చగా పాకిస్థాన్‌ కాల్పుల ఉల్లంఘనలు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ విధించినప్పటికీ పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు మాత్రం ఆగడం లేదు. రెండు దేశాలూ కరోనాతో అల్లాడుతున్నా నియంత్రణ రేఖ వద్ద మాత్రం పాక్‌ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నది. జనవరిలో 367సార్లు కాల్పులు ఉల్లంఘనలు చోటుచేసుకోగా, ఫిబ్రవరిలో 366 సార్లు, కరోనా తీవ్రత అధికంగా ఉన్న మార్చిలో 411 సార్లు కాల్పుల ఉల్లంఘనలు జరుగడం గమనార్హం. ఈ నెలలో ఇప్పటివరకు 53 సార్లు ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి.పీవోకే నుం చి భారత్‌లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు వీలుగా పాక్‌ వ్యవహరిస్తున్నదని సైన్యం తెలిపింది. 


logo