శనివారం 16 జనవరి 2021
National - Dec 26, 2020 , 12:32:12

ఇంద్రేశ్వర్‌ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు

ఇంద్రేశ్వర్‌ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు

శ్రీనగర్‌ : కుక్క తోక వంకర అన్న చందంగా పాక్‌ వక్ర బుద్ధి మారడం లేదు. తీర నియంత్రణ రేఖ వెంట షెల్లింగ్‌ చేస్తూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. గత కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్‌లోని పలు అంతర్జాతీయ సరిహద్దుల్లో, సెక్టార్లలో కాల్పులకు దిగిన విషయం తెలిసిందే. తాజాగా ఇంద్రేశ్వర్‌నగర్‌ సెక్టార్‌లో భారత సైనిక పోస్టులే లక్ష్యంగా దాడులకు దిగింది. సుమారు నాలుగు గంటల పాటు పాక్‌ రేంజర్లు కాల్పులకు దిగారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు కాల్పులు కొనసాగాయి. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) బెటాలియన్‌ సైతం సరైన సమాధానం ఇచ్చింది. కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.