శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 24, 2020 , 15:05:12

పాకిస్థాన్ క్వాడ్‌క్యాప్ట‌ర్‌ను కూల్చేసిన భార‌త సైన్యం

పాకిస్థాన్ క్వాడ్‌క్యాప్ట‌ర్‌ను కూల్చేసిన భార‌త సైన్యం

కుప్వారా: భార‌త సైన్యం చేతిలో ఎన్నిసార్లు చావుదెబ్బ తిన్నా దాయాది దేశం పాకిస్థాన్ తీరు మాత్రం మార‌డంలేదు. భార‌త్‌-పాక్ స‌రిహ‌ద్దుల్లోని నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి ఉగ్ర‌వాదుల చొర‌బాట్ల‌ను ప్రోత్స‌హిస్తూనే ఉన్న‌ది. అందుకోసం కొత్త‌కొత్త మార్గాల‌ను అనుస‌రిస్తున్న‌ది. కొత్త‌గా డ్రోన్‌ల సాయంతో స‌రిహ‌ద్దు‌పై నిఘావేసి ఉగ్ర‌వాదులను భార‌త్‌లోకి చొర‌బెడుతున్నారు. శ‌నివారం కూడా అలాంటి ప్ర‌య‌త్న‌మే చేసిన పాకిస్థాన్‌కు భార‌త్ గ‌ట్టిగా బుద్దిచెప్పింది. 

శ‌నివారం ఉద‌యం 8 గంట‌ల స‌మ‌యంలో జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రం కెరాన్ సెక్టార్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి ఎగురుతున్న పాకిస్థాన్ క్వాడ్ క్యాప్ట‌ర్‌ను భార‌త సైన్యం కూల్చివేసింది. ఈ క్వాడ్ క్యాప్ట‌ర్‌ను చైనా కంపెనీ త‌యారు చేసింద‌ని ఇండియ‌న్ ఆర్మీ గుర్తించింది. ఈ ఉద‌యం లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబ‌డి ఎగురుతున్న డీజేఐ మావిక్ 2 ప్రొ క్వాడ్ క్యాప్ట‌ర్‌ను తాము కూల్చివేశామ‌ని ఆర్మీ ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో స‌రిహ‌ద్దుల్లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపింది.              

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.