బుధవారం 20 జనవరి 2021
National - Dec 18, 2020 , 16:51:11

పాక్‌ యుద్ధ నౌకను పసిగట్టిన భారత్‌

పాక్‌ యుద్ధ నౌకను పసిగట్టిన భారత్‌

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన ఒక యుద్ధ నౌకను భారత్‌ పసిగట్టింది. పాకిస్థాన్‌ నేవీకి చెందిన కొర్వెట్టి పీఎన్ఎస్ టబుక్ కదలికలను ట్రాక్ చేసింది. హిందూ మహా సముద్ర ప్రాంతంలో మోహరించిన భారత నావికాదళానికి చెందిన యుద్ధ నౌక దీనిని గుర్తించింది. పీఎన్ఎస్ టబుక్ యుద్ధ నౌకను రొమేనియా నుండి పాకిస్థాన్‌ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఆ నౌక రొమేనియా నుంచి పాకిస్థాన్‌కు ప్రయాణమవుతుండగా భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక దాని కదలికలను ట్రాక్‌ చేసింది. భారత నేవీ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo