శనివారం 16 జనవరి 2021
National - Dec 21, 2020 , 16:12:17

పంజాబ్ పొలాల్లో పాక్ గ్రెనేడ్లు.. కేసు న‌మోదు

పంజాబ్ పొలాల్లో పాక్ గ్రెనేడ్లు.. కేసు న‌మోదు

గురుదాస్‌పూర్ : ప‌ంజాబ్‌లోని చ‌క్రి పోస్టుకు కిలోమీట‌ర్ దూరంలోని పంట పొలాల్లో పాకిస్తాన్ గ్రెనేడ్లు ల‌భ్య‌మ‌య్యాయి. పాకిస్తానీ డ్రోన్ సంచ‌రిస్తుంద‌న్న ప‌క్కా స‌మాచారంతో చ‌క్రి పోస్టు ప‌రిస‌రాల్లో పంజాబ్ పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో స‌రిహ‌ద్దుకు కిలోమీట‌ర్ దూరంలోని పంట పొలాల్లో పాకిస్తాన్‌కు చెందిన 11 గ్రెనేడ్లు ల‌భ్య‌మైన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ గ్రెనేడ్ల‌పై ఆర్జీఎస్ మార్కు ఉన్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇటీవ‌లే ఇద్ద‌రు స్మ‌గ్ల‌ర్ల‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. వారి నుంచి ఆయుధాల‌ను, డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్ద‌రు నిందితుల‌ను ల‌ఖ్‌బిర్ సింగ్ అలియాస్ ల‌ఖా, బ‌చ్చిత్తార్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఇద్ద‌రిని అమృత్‌స‌ర్ జైలుకు త‌ర‌లించారు.