గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 09, 2020 , 14:37:30

ఆయుధాల స్మ‌గ్లింగ్‌కు ఐఎస్ఐ కుట్ర‌!

ఆయుధాల స్మ‌గ్లింగ్‌కు ఐఎస్ఐ కుట్ర‌!

శ్రీన‌గ‌ర్ : భార‌త బ‌ల‌గాల‌కు చెందిన ఆయుధాల‌ను స్మ‌గ్లింగ్ చేసేందుకు పాకిస్థాన్ ఉగ్ర‌వాద సంస్థ ఐఎస్ఐ కుట్ర చేసిన‌ట్లు భార‌త నిఘా వ‌ర్గాలు గుర్తించాయి. ఇందుకు ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాదుల‌ను ఉప‌యోగించుకోవాల‌ని ఐఎస్ఐ భావిస్తున్న‌ట్లు నిఘా వ‌ర్గాలు పేర్కొన్నాయి. అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వెంబ‌డి ఉన్న గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, పంజాబ్‌, జ‌మ్మూక‌శ్మీర్ ప్రాంతాల్లో పోలీసుల‌ను నిఘా వ‌ర్గాలు అప్ర‌మ‌త్తం చేశాయి. ఎల్‌వోసీ గుండా జ‌మ్మూక‌శ్మీర్‌లోకి ఉగ్ర‌వాదులు చొర‌బాటు చేసేందుకు య‌త్నించే అవ‌కాశం ఉంద‌న్నారు. ఆయుధాల స్మ‌గ్లింగ్‌కు ఉగ్ర‌వాదులు ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు చేసిన‌ట్లు తెలుస్తోంది.