ఆదివారం 07 జూన్ 2020
National - Apr 05, 2020 , 12:42:58

భార‌త పైల‌ట్ల‌ను మెచ్చుకున్న పాకిస్థాన్ ఏటీసీ

భార‌త పైల‌ట్ల‌ను మెచ్చుకున్న పాకిస్థాన్ ఏటీసీ


హైద‌రాబాద్‌: ఎయిర్ ఇండియా సిబ్బందిపై పాకిస్థాన్ ఏటీసీ ప్ర‌శంస‌లు కురిపించింది. లాక్‌డౌన్ ఉన్నా వివిధ దేశాల‌కు ఎయిర్ ఇండియా విమానాలు స‌హాయ ప‌రిక‌రాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నాయి. అయితే యూరోప్ దేశాల‌కు మ‌న విమానాలు పాక్ గ‌గ‌న‌త‌లం వీదుగా  వెళ్లాల్సి ఉంటుంది. దీని కోసం పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్ అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది.  త‌మ గ‌గ‌న‌త‌లాన్ని వాడుకునేందుకు పాక్ మ‌న విమానాల‌కు అనుమ‌తి ఇచ్చింది. అంతేకాదు  క్లిష్ట స‌మ‌యాల్లో సేవాభావంతో ప‌నిచేస్తున్న భార‌తీయ వైమానికి ద‌ళాన్ని పాక్ మెచ్చుకున్న‌ది. ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌కు రెండు విమానాలు బ‌య‌లుదేరాయి. వాస్త‌వానికి పాక్ ఏటీసీ వ‌ద్ద తొలుత మ‌న విమానాల‌కు సిగ్న‌ల్ దొర‌క‌లేదు. కానీ ఫ్రీక్వెన్సీ మార్చిన త‌ర్వాత పాక్ ఏటీసీ క‌న‌క్ట్ అయ్యింది.  అయితే పాక్ ఏటీసీ మ‌న విమానాల‌కు స్వాగ‌తం ప‌లికింది.  విప‌త్క‌ర‌ స‌మ‌యంలో సేవ‌లు అందిస్తున్న భార‌త పైల‌ట్ల‌ను కూడా పాక్ ఏటీసీ ప్ర‌శంసించింది. ఇక ఇరాన్ ఎయిర్‌స్పేస్‌లో భార‌త విమానాలు ఎంట‌ర్ అవుతున్న స‌మ‌యంలోనూ పాక్ ఏటీసీ హెల్ప్ చేసింది.


logo