శనివారం 16 జనవరి 2021
National - Jan 02, 2021 , 20:15:39

రాజౌరి సెక్టార్‌లో పాక్‌ కాల్పులు

రాజౌరి సెక్టార్‌లో పాక్‌ కాల్పులు

జమ్మూ : జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట ఉన్న ఫార్వర్డ్‌ పోస్టులపై పాక్‌ సైన్యం భారీగా కాల్పులకు తెగబడ్డాయి. వారికి భారత సైన్యం దీటైన బదులిస్తోందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 04.45 గంటలకు రాజౌరిలోని నౌషెరా సెక్టార్‌లో మోర్టార్లను ప్రయోగించి.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అని రక్షణ ప్రతినిధి ఒకరు తెలిపారు. నౌషెరా సెక్టార్‌లో పాక్‌ దాడిలో గాయపడిన జేసీఓ నాయబ్‌ సుబేదార్ రవీందర్ శుక్రవారం మరణించినట్లు ప్రతినిధి పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ 2020లో పాక్‌ నియంత్రణ రేఖ వెంట 5,100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అధికార వర్గాలు తెలిపాయి. రోజూ సగటున 14 కేసులతో 18 ఏళ్లలో ఇది అత్యధికం. ఈ ఉల్లంఘనలలో 36 మంది మరణించగా.. 130 మందికి పైగా గాయపడ్డారు. సరిహద్దుల్లో శాంతిని అస్థిరపరిచేందుకు పాక్‌ దళాలు నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి పోస్టులు, గ్రామాలను పదేపదే లక్ష్యంగా చేసుకున్నాయని ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు.