సోమవారం 18 జనవరి 2021
National - Nov 30, 2020 , 16:57:44

నియంత్రణ రేఖ వెంట పాక్‌ కాల్పులు..

నియంత్రణ రేఖ వెంట పాక్‌ కాల్పులు..

పూంచ్‌ : సరిహద్దులో పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. నియంత్రణ రేఖ వెంట కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ భారత సైనికులు, సాధారణ పౌరులే లక్ష్యంగా కాల్పులు జరుపుతోంది. సోమవారం జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో పాక్‌ సైనికులు మరోమారు కాల్పులకు తెగబడ్డారు.  మధ్యాహ్నం 3 గంటల సమయంలో చిన్న ఆయుధాలతో భారత భద్రతా దళాలపైకి కాల్పులు జరిపి మోర్టార్లతో షెల్లింగ్స్‌ చేశారు. భారత జవాన్లు ధీటుగా స్పందించడంతో తోక ముడిచారు.  ఈ నెల 27న రాజౌరి జిల్లాలో నియంత్రణ  రేఖ వెంట పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.