గురువారం 26 నవంబర్ 2020
National - Nov 01, 2020 , 09:27:56

పూంచ్‌ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు

పూంచ్‌ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు

శ్రీనగర్‌ : కుక్కతోక వంకర అన్న చందంగా తయారైంది దాయాది పాకిస్థాన్‌ తీరు. నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా పదే పదే భారత దళాలను పాక్ రెచ్చగొడుతోంది. తాజాగా ఆదివారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని షాపూర్, కిర్ని, కస్బా రంగాల్లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట చిన్న ఆయుధాలతో కాల్పులు జరుపడంతో మోర్టార్లతో దాడులు చేస్తోంది. మోర్టార్లతో షెల్లింగ్ చేయడం ద్వారా పాకిస్తాన్ ఆదివారం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. ‘నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్‌ అప్రకటిత కాల్పుల విరమణ ఉల్లంఘనను కొనసాగిస్తోందని, భారత సైన్యం తగిన విధంగా ప్రతీకారం తీర్చుకుంటుంది’ అని జమ్మూలోని ప్రో డిఫెన్స్ అధికారిక ట్విట్టర్‌ ద్వారా వివరాలు తెలిపింది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.