శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 26, 2020 , 08:12:25

దేగ్వార్‌ సెక్టార్‌లో పాక్‌ వరుస కాల్పులు

దేగ్వార్‌ సెక్టార్‌లో పాక్‌ వరుస కాల్పులు

పూంచ్‌ : జమ్ము కశ్మీర్‌లోని పూచ్‌ జిల్లా దేగ్వార్‌ సెక్టార్‌లో  పాకిస్థాన్‌ మరోమారు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. పాక్‌ సైనికులు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట శుక్రవారం రాత్రి 910:15 గంటలకు ఆయుధాలతో కాల్పులు జరిపి మోర్టార్లతో షెల్లింగ్ చేశారు. భారత జవాన్లు ప్రతిస్పందించడంతో వెనక్కు తగ్గారు. నియంత్రణ రేఖ వెంట నిత్యం ఏదోఒక చోట పాక్‌ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో సరిహద్దు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం దేగ్వార్‌ సెక్టార్‌లోని నవ్‌షెరా ప్రాంతంలో దాయాదీ ఆర్మీ కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo