సోమవారం 13 జూలై 2020
National - Jun 23, 2020 , 16:28:45

టెర్రరిస్టులను పంపేందుకు పాక్ కుట్ర

టెర్రరిస్టులను పంపేందుకు పాక్ కుట్ర

శ్రీనగర్‌: టెర్రరిస్టులను పంపి కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ-కాశ్మీర్‌లో దాడులు చేసేందుకు పాక్‌ కుట్ర పన్నుంతోందని డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ వెల్లడించారు. జమ్మూ-కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల ద్వారా ఈ తీవ్రవాదులు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, భద్రతా దళాలపై దాడులే లక్ష్యంగా వీరు దేశంలోకి చొరబడుతున్నారని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా నౌషెరీ, రాజౌరి-పూంచ్‌, కుప్వరా-కెరాన్‌ సెక్టార్ల ద్వారా అనేకమంది జైషే మహ్మద్‌, లష్కర్‌ తాయిబా టెర్రరిస్టులు దేశంలో ప్రవేశించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే సరిహద్దులోని దళాలకు సమాచారం అందించామని, వారంతా సమన్వయంతో పనిచేస్తున్నారని దిల్‌బాగ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం కూడా పుల్వామా ప్రాంతంలో టెర్రరిస్టులకు, సైన్యానికి మధ్య ఎదురు కాల్లులు జరిగాయి. ఈ కాల్పుల్లో జవాన్‌ సునీల్‌ కాలే వీరమరణం పొందారు. కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు కూడా హతమయ్యారు. అయితే జవాను మృతికి ప్రతీకారంగా శ్రీనగర్‌ సరిహద్దుల్లోని  ఓ తీవ్రవాదుల రహస్య స్థావరాన్ని సైన్యం పేల్చేంసింది. ఈ నేపథ్యంలో మరింత మంది  తీవ్రవాదులు కాశ్మీర్‌లోని ప్రవేశించనున్నారంటూ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.


logo