శనివారం 06 జూన్ 2020
National - May 07, 2020 , 17:36:38

భార‌త్ అనుస‌రిస్తున్న‌ది త‌ప్పుడు అజెండా: ఇమ్రాన్‌ఖాన్‌

భార‌త్ అనుస‌రిస్తున్న‌ది త‌ప్పుడు అజెండా: ఇమ్రాన్‌ఖాన్‌

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మ‌రోసారి భార‌త్‌పై ఆరోప‌ణ‌లు గుప్పించారు. పాకిస్థాన్‌ను ల‌క్ష్యంగా చేసుకుని భారత్ త‌ప్పుడు అజెండా అనుస‌రిస్తున్న‌ద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అంతేకాదు భారత్ చేప‌డుతున్న తప్పుడు ఆపరేషన్ల గురించి ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లు జరుగుతున్నాయన్న నిరాధార ఆరోపణలతో భారత్ తప్పుడు అజెండా కొనసాగిస్తున్న‌ద‌ని ఇమ్రాన్ విమ‌ర్శించారు. కశ్మీర్‌లో జరుగుతున్న అల్లర్లకు త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌న్న ఇమ్రాన్‌.. వాటిని స్థానిక అల్లర్లుగా అభివర్ణించారు. భార‌త ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల వ‌ల్ల దక్షిణాసియాలో శాంతికి భంగం వాటిల్లుతోందని ఆరోపించారు. అయితే, ఇమ్రాన్ ఆరోప‌ణ‌ల‌ను భార‌త్ తిప్పికొట్టింది. బుధ‌వారం పుల్వామా జిల్లాలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర‌వాది రియాజ్ నైకూను మ‌ట్టుబెట్ట‌డంతో పాకిస్థాన్ త‌ట్టుకోలేపోతున్న‌ద‌ని విమ‌ర్శించింది. logo