సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 16:21:11

పాక్ చొరబాటుదారుడి అరెస్టు

పాక్ చొరబాటుదారుడి అరెస్టు

రాజౌరీ : జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట పాక్ చొరబాటు దారుడిని అరెస్టు చేసినట్లు ఆర్మీ అధికారి శనివారం తెలిపారు. నౌషెరా సెక్టార్లో శుక్రవారం రాత్రి పాక్‌ వైపు నుంచి చొరబాటుకు యత్నిస్తున్న వ్యక్తిని గస్తీ కాస్తున్న భద్రతా దళాలు గుర్తించి వెంటనే అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అరెస్టయిన వ్యక్తిని విచారిస్తున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు. గత నాలుగురోజులుగా ఎల్‌ఓసీ వెంట చొరబాటుదారులను అరెస్టు చేయడం ఇది రెండోసారి. పూంచ్ జిల్లాలోని బాలాకోట్ సెక్టార్లో ఎల్‌ఓసీ (లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌) వెంట పాక్‌ వైపు నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని నఖల్ గ్రామస్తుడు అబ్దుల్ రెహ్మాన్(28) జులై 15న భద్రతా దళాలకు పట్టుబడిన విషయం తెలిసిందే.logo