మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 22, 2020 , 11:51:46

భారత భూభాగంలోకి పాక్‌ డ్రోన్లు

భారత భూభాగంలోకి పాక్‌ డ్రోన్లు

శ్రీనగర్‌ : పాకిస్థాన్‌ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనల మధ్య శనివారం రాత్రి తీర నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట మెన్దార్‌ సెక్టార్‌లో డ్రోన్‌ కదలికలను గమనించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. అంతకు ముందు శుక్రవారం సైతం పాకిస్థాన్‌ నుంచి రెండు డ్రోన్లను అధికారులు గుర్తించారు. సరిహద్దు భదతా దళం (బీఎస్‌ఎఫ్‌) వర్గాల ప్రకారం.. సాంబా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెట రెండు డ్రోన్లు సరిహద్దును దాటి వచ్చాయి. వాటిపై భారత బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో డ్రోన్లు తప్పించుకొని పోయాయి. దీంతో సరిహద్దుల వెంట భారత బలగాలు అప్రమత్తయ్యాయి. నిఘాను కట్టుదిట్టం చేశాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.