మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 13:06:16

పాకిస్తాన్‌ ఆర్మీ జవాన్‌ హతం

పాకిస్తాన్‌ ఆర్మీ జవాన్‌ హతం

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా సెక్టార్‌లో గురువారం పాకిస్తాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత ఆర్మీ శిబిరాలపై పాకిస్తాన్‌ సైన్యం కాల్పులు జరిపింది. అప్రమత్తమైన భారత సైన్యం కూడా పాక్‌ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ కాల్పుల్లో పాకిస్తాన్‌ ఆర్మీకి చెందిన ఓ జవాను మృతి చెందాడు. పలువురు జవాన్లు గాయపడినట్లు సమాచారం. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లోని నీలం లోయ నుంచి భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్తాన్‌ గతకొద్ది రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. 


logo