శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 17:33:46

పెయింటింగ్స్‌తో గాల్వ‌న్ అమ‌ర‌వీరుల‌కు ఘ‌న నివాళి

పెయింటింగ్స్‌తో గాల్వ‌న్ అమ‌ర‌వీరుల‌కు ఘ‌న నివాళి

ఢిల్లీ : స‌్వాతంత్ర్య దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని దేశ రాజ‌ధాని న‌గ‌రంలో ఇటీవ‌ల గాల్వ‌న్ లోయలో మృతిచెందిన అమ‌ర‌వీరుల‌కు ఘ‌న నివాళి అర్పించారు. ఆర్మీ సిబ్బంది త్యాగానికి నివాళిగా ప‌లువురు క‌ళాకారులు కాన్నాట్ ప్రాంతంలో పెయింటింగ్స్‌ను ప్ర‌ద‌ర్శించారు. జూన్ 2020లో చైనాతో గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 సైనిక సిబ్బంది అమ‌రులైన విష‌యం తెలిసిందే. వీరి పేర్లు, ఫోటోలు, ర్యాంకులు తెలిసేలా అదేవిధంగా గాల్వ‌న్ లోయ దృశ్యాలు ప్ర‌తిబింబించేలా, వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద కాప‌లా‌గా ఉన్న సైనికుల చిత్రాల‌తో కూడిన పెయింటింగ్స్‌ను ప్ర‌ద‌ర్శ‌న‌గా ఉంచారు. అదేవిధంగా ఈ చిత్రాల్లో ఎడ‌మ‌వైపున మూల‌గ‌ చైనా లిబ‌రేష‌న్ ఆర్మీకి చెందిన సైనికులు కూడా కొలువుదీరారు. జూన్ 15న చైనా సైనికులతో జ‌రిగిన ముఖాముఖి ఘ‌ర్ష‌ణ‌లో భార‌త్‌కు చెందిన 20 మంది సైనికులు అమ‌రుల‌య్యారు. చైనాకు చెందిన 50 మంది సైనికులు చ‌నిపోయిన‌ట్లుగా స‌మాచారం.logo