మంగళవారం 07 జూలై 2020
National - Apr 18, 2020 , 16:30:43

వీధుల్లో పెయింటింగ్‌..క‌రోనాపై అవ‌గాహ‌న‌

వీధుల్లో పెయింటింగ్‌..క‌రోనాపై అవ‌గాహ‌న‌

జార్ఖండ్ లో పెయింటింగ్ ఆర్టిస్టులు పెయింటింగ్ ద్వారా క‌రోనాపై అవ‌గాహ‌న కల్పించారు. రాంఛీ వీధుల్లో పెయింటింగ్ క‌ళాకారుల బృందం గ్రాఫిటీ వెర్ష‌న్ లో పెయింటింగ్ష్ వేశారు. ఇంట్లో ఉండి..సుర‌క్షితంగా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాం. ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ పాటించాల‌ని ఆదేశాలు జారీ చేసినా..చాలా మంది ప్ర‌జ‌లు అర్థం చేసుకోవ‌డం లేదు.

ప్ర‌జ‌లు మేము వేసిన క‌ళారూపాల‌ను చూసైనా..ఇళ్ల‌లో ఉండాల్సిన అవ‌స‌రాన్ని అర్థం చేసుకుంటార‌ని ఆశిస్తున్నాం. క‌రోనాపై అంద‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించేందుకే ఇలా చిత్రాలు వేశామ‌ని ఓ ఆర్టిస్ట్ చెప్పాడు. జార్ఖండ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 33 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా..ఇద్ద‌రు మృతి చెందారు. 





ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo