శనివారం 05 డిసెంబర్ 2020
National - Aug 28, 2020 , 19:09:03

నీవు త్వ‌ర‌గా కోలుకోవాలి మిత్ర‌మా అబే: ప‌్ర‌ధాని మోదీ ట్వీట్

నీవు త్వ‌ర‌గా కోలుకోవాలి మిత్ర‌మా అబే: ప‌్ర‌ధాని మోదీ ట్వీట్

న్యూఢిల్లీ: జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే అనారోగ్యం గురించి తెలిసి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ విచారం వ్య‌క్తం చేశారు. 'మీ ఆనారోగ్యం గురించి తెలిసి బాధ క‌లిగింది ప్రియ మిత్ర‌మా షింజో అబే' అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. 'మీ తెలివైన నాయ‌క‌త్వం, ఉన్న‌త‌మైన వ్య‌క్తిత్వం వ‌ల్ల‌నే భార‌త్‌-జ‌పాన్ సంబంధాలు మునుప‌టి కంటే ప‌టిష్టంగా మారాయి' అని ప్ర‌ధాని ట్విట్ట‌ర్‌లో కొనియాడారు. 'మీరు త్వ‌ర‌గా కోలుకోవాలంటూ భ‌గవంతుడిని ప్రార్థిస్తున్నా' అని పేర్కొన్నారు. 

జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం త‌న ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే తాను రాజీనామా చేస్తున్నాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ.. షింబో అబే త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటూ ట్వీట్ చేశారు.