సోమవారం 08 మార్చి 2021
National - Jan 26, 2021 , 01:45:46

గాన గంధర్వుడికి పద్మవిభూషణ్‌

గాన గంధర్వుడికి పద్మవిభూషణ్‌

  • జపాన్‌ ప్రధాని షింజో అబెకు పద్మవిభూషణ్‌.. చిత్రకు పద్మభూషణ్‌
  • నలుగురు తెలుగు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు
  • తెలంగాణకు చెందిన కనకరాజుకు కళల విభాగంలో
  • పద్మవిభూషణ బాలు
  • అమర గాయకుడికి ప్రతిష్ఠాత్మక పురస్కారం
  • పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. ఏడుగురికి పద్మవిభూషణ్‌
  • పదిమందికి పద్మభూషణ్‌, 102 మందికి పద్మశ్రీ అవార్డులు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి 25 (నమస్తే తెలంగాణ): తన అమృతగానంతో భాషాభేదం లేకుండా కోట్లమందిని సంగీతసాగరంలో మునకలేయించిన అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యాన్ని దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో కేంద్రప్రభుత్వం గౌరవించింది. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2021 ఏడాదికిగాను 119 మందికి పద్మ అవార్డులను సోమవారం ప్రకటించింది. ఎస్పీ బాలుతోపాటు ఏడుగురికి పద్మ విభూషణ్‌, 10 మందికి పద్మభూషణ్‌, 102 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. 

షింజో అబేకూ విభూషణ్‌

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేకు కూడా కేంద్రం ఈ ఏడాది పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయనతోపాటు డాక్టర్‌ బెల్లె మొనప్ప హెగ్డే (కర్ణాటక), నరేందర్‌సింగ్‌ కపవే (కర్ణాటక), మౌలానా వహిదుద్దీన్‌ ఖాన్‌ (ఢిల్లీ), సుదర్శన్‌ సాహూ (ఒడిశా)లకు పద్మవిభూషణ్‌ లభించింది. 

తెలుగు పద్మాలు వీరే

ఈ ఏడాది నలుగురు తెలుగు ప్రముఖులకు పద్మ శ్రీ అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఒక్కరు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపికయ్యారు. ఏపీ నుంచి అన్నవరపు రామస్వామి (కళలు), ప్రకాశ్‌రావు (సాహిత్యం, విద్య), నిడదవోలు సుమతి (కళలు), తెలంగాణ నుంచి కనకరాజు (కళలు) ఉన్నారు.

పద్మ భూషణులు

కృష్ణనాయర్‌ శాంతకుమారి చిత్ర (కళలు), తరుణ్‌ గొగోయ్‌, సుమిత్రా మహాజన్‌ (ప్రజాసంబంధాలు), చంద్రశేఖర్‌ కంబరా (సాహిత్యం, విద్య), నృపేంద్రమిశ్రా (సివిల్‌ సర్వీస్‌), రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ (ప్రజాసంబంధాలు), కేశుభాయ్‌ పటేల్‌ (ప్రజా సంబంధాలు), కల్బే సాధిక్‌ (ఆధ్మాత్మిక రంగం), రజనీకాంత్‌ దేవిదాస్‌ ష్రాఫ్‌ (వాణిజ్యం), తార్‌లోచన్‌ సింగ్‌ (ప్రజాసంబంధాలు).     


VIDEOS

logo