సోమవారం 21 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 02:07:25

షరీఫ్‌ చాచాకు ఆహ్వానం

షరీఫ్‌ చాచాకు ఆహ్వానం

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లో  ‘షరీఫ్‌ చాచా’గా పేరొందిన పద్మశ్రీ మహ్మద్‌ షరీఫ్‌ (82)కు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జరిగే ‘భూమి పూజ’కు రావాలని మంగళవారం ఆహ్వానం అందింది.  అయితే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన పూజకు హాజరు కాలేకపోవచ్చని షరీఫ్‌ కుమారుడు తెలిపారు. సైకిల్‌ మెకానిక్‌గా ఉన్న షరీఫ్‌.. 27 ఏండ్లుగా అనాధ మృతదేహాలకు సొంతఖర్చులతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గత జనవరిలో కేంద్రం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.


logo