సోమవారం 13 జూలై 2020
National - Jun 20, 2020 , 20:07:30

పాన్ షాపులు తెరిచేందుకు అనుమ‌తివ్వండి

పాన్ షాపులు తెరిచేందుకు అనుమ‌తివ్వండి

ముంబై : క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో లాక్ డౌన్ విధించిన విష‌యం విదిత‌మే. లాక్ డౌన్ కార‌ణంగా చిరు వ్యాపారులు భారీగా న‌ష్ట‌పోయారు. వారి ఉపాధికి భంగం వాటిల్లింది. రోజు వారీ సంపాద‌న లేక‌పోవ‌డంతో.. కుటుంబ పోష‌ణ భార‌మైంది. 

పాన్ షాపులు తెరిచేందుకు అనుమ‌తివ్వాల‌ని ఔరంగాబాద్ జిల్లా యంత్రాంగాన్ని.. పాన్ షాపు నిర్వాహ‌కులు కోరారు. ఔరంగాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 7,500 పాన్ షాపులు ఉన్నాయి. కేవ‌లం ఔరంగాబాద్ ప‌ట్ట‌ణంలోనే 3 వేల‌కు పైగా ఉన్నాయి. 

ఈ సంద‌ర్భంగా  ఔరంగాబాద్ జిల్లా పాన్ షాప్ కీప‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు ష‌ర్ఫూద్దీన్ సిద్దిఖీ మాట్లాడుతూ.. లాక్ డౌన్ కార‌ణంగా త‌మ వ్యాపారం పూర్తిగా దెబ్బ‌తిన్న‌ద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. గ‌త మూడు నెల‌ల నుంచి త‌మ షాపులు మూసి ఉంచామ‌ని చెప్పాడు. దీంతో కుటుంబ పోష‌ణ క‌ష్టంగా మారింద‌న్నాడు. పాన్ షాపులు తెరిచి ఉంచితే.. రోజుకు క‌నీసం రూ. 400 నుంచి 500 సంపాద‌న ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నాడు. వీలైనంత త్వ‌ర‌గా పాన్ షాపుల ఓపెన్ కు అనుమ‌తి ఇవ్వాల‌ని సిద్దిఖీ జిల్లా యంత్రాంగానికి విజ్ఞ‌ప్తి చేశారు. 


logo