శనివారం 16 జనవరి 2021
National - Dec 18, 2020 , 15:25:16

రైతు చ‌ట్టాలు రాజ్యాంగ వ్య‌తిరేకం : జ‌ర్న‌లిస్టు సాయినాథ్‌

రైతు చ‌ట్టాలు రాజ్యాంగ వ్య‌తిరేకం : జ‌ర్న‌లిస్టు సాయినాథ్‌

హైద‌రాబాద్:  కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను రద్దు చేయాల‌ని రైతులు చేస్తున్న డిమాండ్ స‌రైందే అని ప్ర‌ఖ్యాత జ‌ర్న‌లిస్టు పీ సాయినాథ్ తెలిపారు. ఈ స‌మ‌స్య ప‌రిష్కారంలో తాను ఎవ‌రి ప‌క్షాన నిల‌వ‌డంలేద‌న్నారు. రైతులతో చ‌ర్చ‌లు నిర్వహించి స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నాలు చేయాలంటూ ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఓ సూచ‌న చేసింది. ఈ నేప‌థ్యంలో జ‌ర్న‌లిస్టు సాయినాథ్ త‌న అభిప్రాయం వెల్ల‌డించారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల్లోని 2, 14, 15 పాయింట్ల‌ను స‌వ‌రించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌దంటే, వాటిల్లో ఎంత లోపం ఉందో అర్థం చేసుకోవ‌చ్చు అన్నారు.  80 నుంచి 90 శాతం వ‌ర‌కు లోపాలు ఉన్న చ‌ట్టాల‌ను స‌వ‌రించ‌డం వ్య‌ర్థ‌మని జ‌ర్న‌లిస్టు సాయినాథ్ అన్నారు. కొత్త రైతు చ‌ట్టాలు రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్య‌తిరేక చ‌ట్టాల‌ను స‌వ‌రించ‌గ‌ల‌మా, వాటిని ర‌ద్దు చేయ‌డ‌మే ఉత్త‌మం అని అన్నారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాలపై చ‌ర్చించేందుకు ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను ఏర్పాటు చేయాల‌ని సాయినాథ్ కోరారు.