మంగళవారం 31 మార్చి 2020
National - Feb 13, 2020 , 02:59:18

ఏఐసీసీ నేత పీసీ చాకో రాజీనామా

ఏఐసీసీ నేత పీసీ చాకో రాజీనామా

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ ఢిల్లీ ఇన్‌ఛార్జి పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఎన్నికల్లో ఓటమిపై ఢిల్లీ కాంగ్రెస్‌ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. 2013 నుంచే ఢిల్లీలో పార్టీకి గడ్డు రోజులు మొదలయ్యాయని నాటి సీఎం దివంగత షీలాదీక్షిత్‌పై చాకో పరోక్షంగా విమర్శలు చేశారు. మరోనేత శర్మిష్ఠ ముఖర్జీ పార్టీ నేత చిదంబరంపై విరుచుకుపడ్డారు. ఆప్‌ విజయాన్ని చిదంబరం ప్రశంసించడాన్ని తప్పుపట్టిన శర్మిష్ఠ.. ‘అన్ని రాష్ర్టాలలో బీజేపీపై ఇతరులు పోరాడుతారు.. ఇకపై మన రాష్ట్ర పార్టీ శాఖలను మూసేద్దాం’ అంటూ మండిపడ్డారు. ‘బీజేపీని ఓడించే బాధ్యతను కాంగ్రెస్‌ ప్రాంతీయపార్టీలకు వదిలేసిందా? మన ఓటమి గురించి చిం తించకుండా ఆప్‌ విజయంపై ఎందుకు సంబురపడుతున్నారు?’ అంటూ చిదంబరాన్ని నిలదీశారు.
logo
>>>>>>