మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 08:28:14

ఆక్స్‌ఫ‌ర్డ్ టీకా.. భార‌త్‌లో 5 చోట్ల ట్ర‌య‌ల్స్‌

ఆక్స్‌ఫ‌ర్డ్ టీకా.. భార‌త్‌లో 5 చోట్ల ట్ర‌య‌ల్స్‌

హైద‌రాబాద్‌: ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెన్‌కా కోవిడ్‌19 టీకా కోసం భార‌త్‌లో అయిదు చోట్ల తుది, మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్నారు. బయోటెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్ సెక్ర‌ట‌రీ రేణూ స్వ‌రూప్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. భార‌త్‌లో ఆక్స్‌ఫ‌ర్డ్ టీకాను వాడ‌కంలో తీసుకురావ‌డానికి ముందు.. ఆ టీకాను ఇక్క‌డే ప‌రీక్షించ‌డం అత్యంత ముఖ్య‌మైన విష‌య‌మ‌ని స్వ‌రూప్ తెలిపారు.  భార‌త్‌కు చెందిన సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ఇండియాలో ఈ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ది. తొలి రెండు ద‌శ‌ల‌కు చెందిన ట్ర‌య‌ల్స్ నివేదిక‌ల‌ను ఇప్ప‌టికే ప‌బ్లిష్ చేశారు.  

భార‌త్‌లో ఎటువంటి కోవిడ్‌19 వ్యాక్సిన్ ప‌రీక్ష‌లు జ‌రిగినా.. దాంట్లో డీబీటీ భాగ‌స్వామ్యం ఉంటుంద‌ని స్వ‌రూప్ తెలిపారు. ఫండింగ్‌, రెగ్యులేట‌రీ క్లియ‌రెన్సులు, విభిన్న నెట్వ‌ర్క్‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌డం వంటి అన్ని అంశాలు బ‌యోటెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్ కింద‌కు వ‌స్తాయ‌న్నారు.  ఆక్స్‌ఫ‌ర్డ్ మూడ‌వ ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కోసం సైట్ల‌ను ఖ‌రారు చేసే ప‌నిలో డీబీటీ ఉన్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం మ‌న దేశంలో అయిదు సైట్లు అందుబాటులో ఉన్న‌ట్లు స్వ‌రూప్ తెలిపారు. logo