శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 14:07:37

కరోనా వ్యాక్సిన్‌పై శుభవార్త చెప్పనున్న ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ

కరోనా వ్యాక్సిన్‌పై శుభవార్త చెప్పనున్న ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ

న్యూడిల్లీ : కరోనా వైరస్‌ ప్రపంచాన్నే వణికిస్తుంది. ఈ వైరస్‌ను వివారించేందుకు  ప్రపంచ దేశాల్లోని ఎంతో మంది శాస్ర్తవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇటీవల కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్‌ను కనిపెట్టిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వాక్సిన్‌ ట్రైల్స్‌కు సంబంధించి శుభవార్త చెప్పనుంది. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేస్‌-3 హ్యూమన్‌ ట్రైల్స్‌ పూర్తి చేశామని యూనివర్సిటీ స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్‌ ట్రైల్స్‌లో మంచి ఫలితాలు వచ్చయని యూనివర్సిటీ తెలిపింది. 

వివిధ దేశాలలో వందల మంది కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన ప్రయోగాలు చేస్తున్నా.. వాటిలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శటీ లైసెన్స్‌ పొందించిన ప్రముఖ ఇండియన్‌ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా వాక్సిన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దీంతో తర్వలోనే కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo