ఇండియాలో తొలి వ్యాక్సిన్ ఆక్స్‌ఫర్డ్‌దే!

న్యూఢిల్లీ: ఇండియాలో తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్ ఆక్స్‌ఫర్డ్‌దే కావచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే దీని కోసం ప్రస్తుతం యూకే వైపు చూస్తోంది ఇండియా. వచ్చే వారం ఈ వ్యాక్సిన్‌కు యూకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ దేశం ఓకే చెప్పగానే.. ఇండియాలోనూ ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మన దేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్ పేరుతో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. బ్రిటన్‌లో అనుమతి ప్రక్రియ పూర్తవగానే.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)లోని కొవిడ్-19పై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ వ్యాక్సిన్‌పై సమీక్ష నిర్వహించనుంది. అందులో కొవిషీల్డ్ భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటాను పరిశీలించి అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
కొవాగ్జిన్ పరిస్థితి ఏంటి?
ఇండియాలో రాబోతున్న తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్ కొవిషీల్డే అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆక్స్‌ఫర్డ్‌తోపాటు భారత్ బయోటెక్, ఫైజర్ కూడా దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ ఇంకా మూడో దశ ప్రయోగాల్లోనే ఉండటంతో ఈ వ్యాక్సిన్ రావడానికి ఇంకా సమయం పట్టవచ్చు. ఇక ఫైజర్ విషయానికి వస్తే.. ఆ సంస్థ నిపుణుల కమిటీ ముందు ఇంకా ప్రజెంటేషన్ ఇవ్వలేదు. ఫైజర్ వ్యాక్సిన్‌కు ఇప్పటికే యూఎస్, యూకే, బహ్రెయిన్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. సీరమ్ వ్యాక్సిన్‌కు సంబంధించి మరింత డేటా కావాలని గత వారమే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) కోరింది. ఫేజ్ 2, 3 ట్రయల్స్‌కు సంబంధించి అప్డేట్ చేసిన భద్రత డేటాను ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సిన్ తయారు చేసే పుణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, వ్యాక్సిన్ తయారీదారు ఆస్ట్రాజెనెకాలతో చేతులు కలిపింది. ఇప్పటికే ఇండియాలో 4 కోట్ల డోసులు కొవిషీల్డ్ తయారు చేసింది.
తాజావార్తలు
- ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
- రిపబ్లిక్ డే.. సరిహద్దులో భారీ భద్రత
- మొదలైన సర్కారు వారి పాట షూటింగ్.. వీడియో
- రెండు బస్సుల మధ్య బైకు.. బ్యాంకు మేనేజర్ మృతి
- మెక్సికో ప్రెసిడెంట్‌కు కరోనా పాజిటివ్
- దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
- నెత్తిన ముళ్ల కిరీటం, చేతులకు శిలువ.. జగపతి బాబు లుక్ వైరల్
- 1.28 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం
- తెలంగాణ ఎంసెట్ సిలబస్ తగ్గింపు?
- నల్లగొండలో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య