బుధవారం 05 ఆగస్టు 2020
National - Aug 03, 2020 , 01:42:56

17 లక్షలు దాటిన కేసులు

17 లక్షలు దాటిన కేసులు

  • 11,45,629 మంది రికవరీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ 50వేలకుపైగా నమోదయ్యాయి. శనివారం నుంచి ఆదివారం నాటికి 24 గంటల వ్యవధిలో 54,735 కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 17,50,723కి చేరింది. కొవిడ్‌       బారి నుంచి ఇప్పటి వరకు 11,45,629 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 65.44 శాతంగా నమోదైంది. కొత్తగా 853 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 37,364కు పెరిగింది. అయితే నమోదవుతున్న కేసులతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యను పోల్చిచూస్తే మరణాలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. జూన్‌లో 3.33 శాతంగా ఉన్న మరణాల రేటు 2.13 శాతానికి తగ్గింది. 24 గంటల వ్యవధిలో 51,225 మంది కోలుకున్నారు. దేశంలో 50వేలకుపైగా కేసులు నమోదుకావడం వరుసగా నాలుగో రోజు.


logo