శుక్రవారం 10 జూలై 2020
National - Jun 25, 2020 , 09:54:45

రాత్రికి రాత్రే దేశాన్ని జైలులా మార్చేశారు..

రాత్రికి రాత్రే దేశాన్ని జైలులా మార్చేశారు..

హైద‌రాబాద్‌: మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ.. 1975లో దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించిన విష‌యం తెలిసిందే. ఆ ఎమ‌ర్జెన్సీకి నేటితో 45 ఏళ్లు నిండాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఆ నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వ తీరును ఖండించారు.  45 ఏళ్ల క్రితం ఇదే రోజున అధికార దాహంతో ఉన్న ఓ కుటుంబం దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించింద‌న్నారు. రాత్రికి రాత్రే దేశాన్ని జైలలా మార్చేశార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన షా.. మీడియాను, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను, భావ‌స్వేచ్ఛ‌ను నాశ‌నం చేసిన‌ట్లు విమ‌ర్శించారు. పేద‌, బ‌ల‌హీన‌వ‌ర్గాల వారిపై అకృత్యాలు జ‌రిగిన‌ట్లు తెలిపారు. 

ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల ప్ర‌య‌త్నాల వ‌ల్ల ఎమ‌ర్జెన్సీని ఎత్తివేశార‌ని షా అన్నారు. దేశంలో ప్ర‌జాస్వామ్యాన్ని మ‌ళ్లీ నిలిపార‌ని, కానీ అది కాంగ్రెస్ పార్టీలో మాత్రం లోపించింద‌న్నారు. జాతి ప్ర‌యోజ‌నాలు, పార్టీ ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న పెట్టి ఒక్క కుటుంబమే రాజ్య‌మేలింద‌న్నారు. ఇప్ప‌టికి కూడా ఆ పార్టీలో ఇదే త‌ర‌హా వ్య‌వ‌హారాలు న‌డుస్తున్న‌ట్లు షా ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీలో ఎమ‌ర్జెన్సీ మైండ్‌సెట్ అలాగే ఉండిపోయింద‌ని, దానిపై ఆ పార్టీ ఆత్మావ‌లోక‌నం చేసుకోవాల‌న్నారు. 

కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఆ కుటుంబానికి చెంద‌నివాళ్లు ఎందుకు నోరు విప్ప‌డం లేద‌ని షా ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేత‌లు ఎందుకు ఆందోళ‌న‌కు లోన‌వుతున్నార‌ని అడిగారు. 

logo