గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 16:00:06

కోటి లీటర్ల నీటిని ఒడిసిపట్టాడు!

కోటి లీటర్ల నీటిని ఒడిసిపట్టాడు!

బెంగళూరు : ఒక రోజు రాత్రి కురిసిన వర్షం ఆ రైతు ఏడాది పాటు నీటికి కరువు లేకుండా చేసింది. తన మామిడి క్షేత్రానికి అవసరమైన సుమారు కోటి లీటర్ల నీటిని ఒడిసిపట్టాడు ఓ ఆధునిక రైతన్న. బెంగళూరు రూరల్ జిల్లా దేవనహళ్లికి చెందిన అంజినప్ప అనే బీఈ (సివిల్) అనే ఓ అంజినప్ప. తన 40 ఎకరాల మామిడి తోటలోని మూడు బోరు బావులు ఎండిపోయాయి. దీంతో వర్షం నీటిని ఒడిసిపట్టాలని సంకల్పించి, 15  అడుగుల లోతుతో 180x180 అడుగుల సైజులో భారీ ఫాం పాండ్‌ను రూ.13లక్షలతో తవ్వాడు. ఇందుకు ఉద్యానవన శాఖ రూ.5.5లక్షలు సబ్సిడీ ఇచ్చింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీరు అందులోకి వస్తుండగా, ఆదివారం కురిసిన భారీ వర్షానికి నిండిపోయింది. ఇందులో సుమారు కోటి లీటర్ల వరకు నీటి నిల్వ ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం 4వేల మామిడి చెట్లకు ఏడాది పాటు ఈ నీరు సరిపోతుందని, అలాగే భూగర్భజలాలు పెరిగి బోరుబావుల్లోకి నీరు వస్తుందని రైతు సంతోషపడ్డాడు.

ఈ సందర్భంగా అంజినప్ప మాట్లాడుతూ రైతులు నీటి కొరతను అధిగమించేందుకు ఫాం పాండ్‌ తవ్వుకోవాలని సూచించారు. ‘ఈ సారి కరోనా మహమ్మారి కారణంగా మామిడి పికింగ్‌ టూరిజం జరుగలేదని, స్వయంగా బెంగళూరులోని అపార్ట్‌మెంట్లలోకి వెళ్లి డోర్‌ డెలివరీ చేశారని, ఎలాంటి నష్టాలు రాలేదని’ చెప్పాడు. కాగా, తుమకూరులో రికార్డు స్థాయిలో 24 మి.మీ వర్షపాతం నమోదైంది. కునిగల్‌లో అత్యధికంగా 43 మిలీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కోరటగెరెలో 40 ఎం.ఎం, మధుగిరిలో 35 మిలీమీటర్ల వర్షపాతం నమోదైంది. ‘దాపు అన్ని తాలూకాల్లో వర్షాలు కురిసాయని, జిల్లాకు జనవరి నుంచి ఒకే రోజు రికార్డు ఉంది’ అని కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం గణాంకాలను ఉటంకిస్తూ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రాజసులోచన వివరించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo