బుధవారం 27 మే 2020
National - May 21, 2020 , 11:47:29

ఒక్క రోజులో లక్ష పరీక్షలు: ఐసీఎంఆర్‌

ఒక్క రోజులో లక్ష పరీక్షలు: ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను నిర్ధారించడానికి గత 24 గంటల్లో 1,03,532 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) ప్రకటించింది. మొత్తంగా మే 21 వరకు దేశవ్యాప్తంగా 26,15,920 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడింది. కరోనా పాజిటివ్‌ కేసులను నిర్ధాణకు కొత్త గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది. వీటిని  తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. 

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 5609 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,359కి పెరిగింది.


logo