శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 12:35:32

10 కోట్ల మంది రైతుల‌కు ల‌క్ష కోట్లు ఇచ్చాం: ప‌్ర‌ధాని మోదీ

10 కోట్ల మంది రైతుల‌కు ల‌క్ష కోట్లు ఇచ్చాం: ప‌్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్‌: దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశ‌ల్య యోజ‌న వ్య‌వ‌స్థాప‌క దినోత్సవ సంబ‌రాల్లో మోదీ పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు. భార‌త్‌ను ఉత్త‌మ దేశంగా, ఉత్త‌మ స‌మాజంగా తీర్చిదిద్దేందుకు పండిట్ దీన్ ద‌యాళ్ ఎంతో చేశార‌న్నారు. గ‌తంలో ప్ర‌భుత్వం సంక్లిష్ట‌మైన చ‌ట్టాలు చేసాయ‌ని,  రైతులు-కార్మికులు వాటిని అర్థం చేసుకోలేక‌పోయార‌న్నారు. కానీ త‌మ ప్ర‌భుత్వం ఆ ప‌రిస్థితిని మార్చింద‌న్నారు. రైతుల సంక్షేమం కోసమే సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టామ‌న్నారు. బ్యాంకులతో అనుసంధానమ‌య్యే రీతిలో రైతుల‌ను తీర్చిదిద్దామ‌ని,  పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి ద్వారా సుమారు ప‌ది కోట్ల మంది రైతుల‌కు ల‌క్ష కోట్లు బ‌దిలీ చేశామ‌న్నారు.  రైతుల‌కు కిసాన్ కార్డులు ఇవ్వాల‌ని ఆలోచిస్తున్నామ‌ని, దీని ద్వారా రైతులు ఈజీగా రుణాలు పొంద‌వ‌చ్చు అని ప్ర‌ధాని మోదీ తెలిపారు.

తాము తీసుకువ‌చ్చిన కొత్త కార్మిక సంస్క‌ర‌ణ‌ల‌తో కార్మికుల జీవితాలు మారిపోతాయ‌ని ప్ర‌ధాని వెల్ల‌డించారు.  క‌నీస వేత‌న స్కీమ్ కింద ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 30 శాతం మంది కార్మికులు మాత్ర‌మే వ‌చ్చార‌ని, అసంఘ‌టిత రంగంలోని ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌నిచేస్తున్న కార్మికులంద‌రికీ ఈ స్కీమ్ వ‌ర్తిస్తుంద‌ని మోదీ తెలిపారు. క‌నీస వేత‌నాల‌కు సంబంధించి వేల సంఖ్య‌లో స్లాబ్‌లు ఉండేవ‌ని, ఇప్పుడు వాటిని 200 స్లాబ్లుల‌కు కుదించిన‌ట్లు ప్ర‌ధాని చెప్పారు. 


logo