మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 18:08:38

దేశీయ విమానాల్లో ఒకేరోజు 75వేల మంది ప్రయాణం

దేశీయ విమానాల్లో ఒకేరోజు 75వేల మంది ప్రయాణం

న్యూఢిల్లీ : దేశీయ విమాన సర్వీసుల్లో జులై 4న(శనివారం) 75వేల మంది ప్రయాణించినట్లు పౌర విమానయానశాఖ మంత్రి హరిదీప్‌సింగ్‌ పూరి ఆదివారం తెలిపారు. లాక్‌డౌన్‌ తరువాత మే 25నుంచి 30వేల మంది ప్రయాణికులతో దేశీయ విమాన సర్వీసులు కార్యకలాపాలు సాగుస్తున్నాయని, శనివారం 75వేల మార్కును అధిగమించడం నిలకడగా ప్రయాణికులు పెరుగుతున్నారనేందుకు నిదర్శమని పేర్కొన్నారు. శనివారం రాత్రి 11గంటల 59 నిమిషాల వరకు 1,560 విమానాల్లో 76,104మంది ప్రయాణించారని ఆయన వెల్లడించారు. ఆయా విమానాశ్రయాలకు 1,53,547 మంది ప్రయాణికులు వచ్చారని పేర్కొన్నారు. కాగా కరోనా నేపథ్యంలో మార్చి 25నుంచి దేశవ్యాప్తంగా వాణిజ్య ప్రయాణికుల విమానాలను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ ముగియడంతో మే 25నుంచి తిరిగి కార్యకలాపాలను ప్రారంభించింది.logo