శుక్రవారం 10 జూలై 2020
National - Jun 24, 2020 , 15:58:39

73.5 ల‌క్ష‌ల‌కు పైగా న‌మూనాల‌ను ప‌రీక్షించాం : ఐసీఎంఆర్

73.5 ల‌క్ష‌ల‌కు పైగా న‌మూనాల‌ను ప‌రీక్షించాం : ఐసీఎంఆర్

న్యూఢిల్లీ : క‌రోనా మహ‌మ్మారి దేశ ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4 ల‌క్ష‌ల 57 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 14,500ల మంది చ‌నిపోయారు. అయితే దేశంలో క‌రోనా విజృంభించిన‌ప్ప‌టి నుంచి.. జూన్ 23 వ‌ర‌కు 73,52,911 ర‌క్త న‌మూనాల‌ను ప‌రీక్షించిన‌ట్లు ఐసీఎంఆర్ బుధ‌వారం వెల్ల‌డించింది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే 2,15,195 న‌మూనాల‌ను ప‌రీక్షించిన‌ట్లు చెప్పింది. 

కొవిడ్ -19కు సంబంధించి దేశ వ్యాప్తంగా మొత్తం వెయ్యి ప్ర‌యోగ‌శాల‌లు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని తెలిపింది. ఇందులో 730 ల్యాబ్ లు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల ప‌రిధిలో ఉండ‌గా, 270 ప్ర‌యోగ‌శాల‌లు ప్రైవేటు ఆస్ప‌త్రుల ప‌రిధిలో ఉన్న‌ట్లు పేర్కొంది. వీటిలో ఆర్టీ - పీసీఆర్ ల్యాబ్స్ 557, ట్రునాట్ ల్యాబ్స్ 363, సీబీఎన్ఏఏటీ ల్యాబ్స్ 80 ఉన్నాయి. 


logo