సోమవారం 13 జూలై 2020
National - Jun 20, 2020 , 16:30:58

ప్ర‌తి రోజూ 700 విమాన స‌ర్వీసులు న‌డుపుతున్నాం..

ప్ర‌తి రోజూ 700 విమాన స‌ర్వీసులు న‌డుపుతున్నాం..

హైద‌రాబాద్‌: పౌర విమాన‌యాన శాఖ మంత్రి హ‌రిదీప్ సింగ్ పురి ఇవాళ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌తి రోజూ 700 దేశీయ విమానాలు ఎగురుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  విమాన స‌ర్వీసులు, ఇత‌ర అంశాల‌పై ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇత‌ర దేశాలు త‌మ గ‌గ‌న‌త‌లాన్ని ఓపెన్ చేసిన త‌ర్వాత‌.. అంత‌ర్జాతీయ విమానాల‌ను మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  ఇత‌ర దేశాలు విమాన రాక‌పోక‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తేనే, అంతర్జాతీయ స‌ర్వీసులు మ‌ళ్లీ ప్రారంభం అవుతాయ‌న్నారు.  ఏ దేశం కూడా ఇప్ప‌టి వ‌ర‌కు క‌మ‌ర్షియ‌ల్ అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను  ప్రారంభించ‌లేద‌న్నారు. 

విదేశాల్లో చిక్కుకున్న సుమారు 275000 మందిని భార‌త్‌కు తీసుకువ‌చ్చిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఆగ‌స్టు 24 తేదీ త‌ర్వాత కూడా విమాన టికెట్ ధ‌ర‌ల‌ను పొడిగించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు విమాన‌యాన శాఖ కార్య‌ద‌ర్శి పీఎస్ ఖ‌రోలా తెలిపారు. మ‌రికొన్ని రోజుల్లో రూట్ల సంఖ్య‌ను పెంచ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. logo