శనివారం 04 జూలై 2020
National - Jun 27, 2020 , 22:05:32

వివాహ వేడుకకు 50మంది అతిథులు.. 6లక్షలకుపైగా జరిమానా

వివాహ వేడుకకు 50మంది అతిథులు.. 6లక్షలకుపైగా జరిమానా

బిల్వారా : రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాలో కరోనా నియమావళికి విరుద్ధంగా ఇటీవల 50మందితో కుమారుడి వివాహ వేడుక నిర్వహించిన ఓ వ్యక్తికి ఆ జిల్లా కలెక్టర్‌ 6లక్షల 26వేల 600 జరిమానా విధించారు. ఈ 50మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందరికీ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఓ వ్యక్తి ఇన్‌ఫెక్షన్‌కు గురై మృతి చెందాడు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చిణీయాంశమవడంతో అధికారులు అప్రమత్తమై కరోనా నియమాళిని కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. దుకాణాల సముదాయం వద్ద జనాలు గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు పాటించని వాహనదారులపైనా కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


logo