శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 13, 2021 , 13:31:44

ఆ 60 గ్రామాల్లో బీజేపీ నాయ‌కుల‌పై నిషేధం

ఆ 60 గ్రామాల్లో బీజేపీ నాయ‌కుల‌పై నిషేధం

హ‌ర్యానా : రైతుల‌కు వ్య‌తిరేకంగా తీసుకొచ్చిన కొత్త సాగు చ‌ట్టాల‌పై హ‌ర్యానా వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రైతుల‌ను ఆందోళ‌న‌ల‌ను ప‌ట్టించుకోని భార‌తీయ జ‌న‌తా పార్టీ, జ‌న‌నాయ‌క్ జ‌న‌తా పార్టీ(జేజేపీ) నాయ‌కుల‌పై రైతులు క‌న్నెర్ర చేస్తున్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌ను గ్రామాల్లోకి రానివ్వొద్ద‌ని 60 గ్రామాల ప్ర‌జ‌లు, రైతులు ఏక‌గ్రీవ తీర్మానాలు చేశారు. ప్ర‌ధానంగా జ‌న‌నాయ‌క్ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యేలు రైతుల నుంచి తీవ్ర‌మైన నిర‌స‌న‌లు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో రైతుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు మోదీతో స‌మావేశం అవుతాన‌ని జేజేపీ ఎమ్మెల్యే, హ‌ర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా తెలిపారు. అయితే హ‌ర్యానాలో బీజేపీ - జేజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వానికి ఎలాంటి ఢోకా లేద‌ని సీఎం మ‌నోహర్ లాల్ ఖ‌ట్ట‌ర్ స్ప‌ష్టం చేశారు.  


logo