శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 18:36:42

అస్సాంలో వరదలకు 56 లక్షల మంది ప్రభావితం

అస్సాంలో వరదలకు 56 లక్షల మంది ప్రభావితం

గౌహతి : అస్సాంలోని 30 జిల్లాల్లో రెండు నెలరోజులుగా సంభవించిన వరద కారణంగా దాదాపు 56 లక్షల మంది ప్రభావితమయ్యారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది. మే 22 నుంచి ఇప్పటివరకు 109 మంది మృతి చెందారని పేర్కొంది. వరద బాధితులకు ఆశ్రయం కల్పించేందుకు 621 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపింది. రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ దళాలతోపాటు ఇతర శాఖల సిబ్బంది, స్థానిక యువత సహాయక చర్యల్లో పాల్గొని 81,678 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2,62,723 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


logo