బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 18:24:57

50శాతం కొత్త ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులున్నాయట..!

50శాతం కొత్త ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులున్నాయట..!

న్యూఢిల్లీ: ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేల్లో 50 శాతం మందిపై క్రిమినల్‌ కేసులున్నాయట. తాజాగా అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌  (ఏడీఆర్‌) జరిపిన  అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఏడీఆర్‌ నివేదిక ప్రకారం 37 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యాచారం, హత్యాయత్నం, మహిళల పట్ల నేరాలు నమోదు కావడం గమనార్హం. 37 మందిలో 13 మందిపై మహిళలకు సంబంధించిన నేరాలు నమోదవగా.. వీరిలో ఒకరిపై అత్యాచార కేసు రిజిస్టర్‌ అయిందట. మరో 24 మంది ఎమ్మెల్యేలపై పలు రకాల క్రిమినల్‌ కేసులో నమోదయ్యాయి. అంతేకాదు 45 ఆప్‌ ఎమ్మెల్యేలు, ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలకు కోటి రూపాయలకు పైగా ఆస్తులున్నట్లు ఏడీఆర్‌ అధ్యయనంలో వెల్లడైంది. 


logo