మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 03:00:16

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం ఊపిరాడక 50 ఆవులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం ఊపిరాడక 50 ఆవులు మృతి

బిలాస్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. పంచాయతీ భవన్‌లోని అత్యంత ఇరుకైన గదిలో 50 ఆవులను ఉంచడంతో అవి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాయి. గది నుంచి దుర్వాసన వస్తున్నదని గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఘటనకు బాధ్యుడైన సర్పంచ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం భూపేశ్‌ బఘేల్‌ తెలిపారు. 


logo