శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 09:44:24

రికార్డు స్థాయిలో 4.42 ల‌క్ష‌ల‌ క‌రోనా ప‌రీక్ష‌లు

రికార్డు స్థాయిలో 4.42 ల‌క్ష‌ల‌ క‌రోనా ప‌రీక్ష‌లు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర‌ప్ర‌భుత్వం పెద్ద‌మొత్తంలో క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో 4,42,031 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది. ఇంత పెద్ద‌మొత్తంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం ఇదే మొద‌టి సార‌ని వెల్ల‌డించింది. అదేవిధంగా ప్ర‌భుత్వ ఆధ్వ‌‌ర్యంలోని ల్యాబుల్లో 3,62,153 న‌మూనాల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని తెలిపింది. ఇది కూడా ఒక రికార్డ‌ని వెల్ల‌డించింది. ప్రైవేట్ ల్యాబుల్లో ఒకేరోజు 79,878 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని పేర్కొంది. 

దేశంలో గ‌త 24 గంట‌ల్లో 32,223 మంది కోలుకున్నార‌ని కేంద్ర‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 8,49,431 మంది క‌రోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. రిక‌వ‌రీ రేటు 63.54 శాతానికి పెరిగింద‌ని వెల్ల‌డించింది. అదేవిధంగా దేశంలో యాక్టివ్‌కేసులు 3,93,360కి పెరిగాయ‌ని ప్ర‌క‌టించింది. 


logo