గురువారం 04 జూన్ 2020
National - May 11, 2020 , 09:47:54

దేశంలో 24 గంటల్లో 4200 కరోనా కేసులు

దేశంలో 24 గంటల్లో 4200 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 67,152కి పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 4,200 కరోనా కేసులు నమోదవగా, 97 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2206 మంది మృతిచెందారు. ఈ వైరస్‌ బారిన పడిన 20,916 మంది కోలుకోగా, 44,029 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 

దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 22171కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 832 మంది మరణించారు. గుజరాత్‌లో మొత్తం 8194 కరోనా కేసులు నమోదవగా, ఈ వైరస్‌ వల్ల 493 మంది మృతిచెందారు. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 7204కు చెరింది. అదేవిధంగా ఢిల్లీలో 6923కు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 3614 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 215 మంది మృతిచెందారు. 


logo