శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 23, 2021 , 12:31:10

రికార్డ్‌.. ఒకే రోజు 3 ల‌క్ష‌ల మందికి టీకా

రికార్డ్‌.. ఒకే రోజు 3 ల‌క్ష‌ల మందికి టీకా

న్యూఢిల్లీ : క‌రోనా మ‌హ‌మ్మారి నివార‌ణ‌కు దేశ వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క‌రోజే 3 ల‌క్ష‌ల మందికి క‌రోనా టీకా వేసిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. జ‌న‌వ‌రి 16వ తేదీ నుంచి నిన్న‌టి వ‌ర‌కు 14 ల‌క్ష‌ల మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు తెలిపింది. గ‌త వారం రోజుల నుంచి రోజుకు దాదాపు 2 ల‌క్ష‌ల మంది క‌రోనా టీకా తీసుకున్నారు. నిన్న ఒక్క‌రోజే 3,47,058 మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.  

జ‌న‌వ‌రి 16న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కొవిషీల్డ్‌, కొవాగ్జిన్ టీకాల పంపిణీ ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. మొద‌టి ద‌శ‌‌లో భాగంగా 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు క‌రోనా టీకా ఇస్తున్నారు. రెండో ద‌శ‌లో 50 ఏండ్ల‌కు పైబ‌డిన వారితో పాటు ప్ర‌ధాన‌మంత్రి, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ర్టాల సీఎంలు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు టీకా ఇవ్వ‌నున్నారు.  

VIDEOS

logo