మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 17:42:16

క‌రోనా క‌ల‌క‌లం.. 20 పోలీసు స్టేష‌న్లు మూసివేత‌

క‌రోనా క‌ల‌క‌లం.. 20 పోలీసు స్టేష‌న్లు మూసివేత‌

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో క‌రోనా వైర‌స్ క‌ల‌కలం రేపుతోంది. బెంగ‌ళూరు సిటీలో విధులు నిర్వ‌ర్తిస్తున్న ప‌లువురు పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఏయే పోలీసు స్టేష‌న్ల‌లో అయితే క‌రోనా కేసులు అధికంగా న‌మోదు అయ్యాయో.. వాటిని మూసివేయాల‌ని బెంగ‌ళూరు పోలీసు క‌మిష‌న‌ర్ భాస్క‌ర్ రావు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో మొత్తం 20 పోలీసు స్టేష‌న్ల‌ను మూసేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. అత్య‌వ‌స‌ర కేసుల‌ను ప‌రిష్క‌రించేందుకు.. మూసివేసిన పీఎస్ ల ప‌రిస‌రాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసి ప‌రిష్క‌రిస్తున్నారు.  

క‌రోనా కేసులు న‌మోదైన పోలీసు స్టేష‌న్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. క‌రోనా వ్యాప్తి దృష్ట్యా, ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని స్టేష‌న్ల‌ను మూసివేసిన‌ట్లు సీపీ తెలిపారు. క‌మ‌ర్షియ‌ల్ స్ర్టీట్, క‌ట్టోన్ పేట్, చిక్ పేటే, కేజీహ‌ల్లి ట్రాఫిక్ పోలీసు స్టేష‌న్ల‌తో పాటు మ‌రిన్నింటిని మూసేశారు. ట్రాఫిక్, సివిల్ పోలీసుల‌తో పాటు హోంగార్డుల‌కు సేఫ్టి గ్లౌసులు, మాస్కులు, శానిటైజ‌ర్లు ఇచ్చామ‌ని సీపీ పేర్కొన్నారు.   


logo