శుక్రవారం 15 జనవరి 2021
National - Nov 29, 2020 , 15:40:27

18వేల కిలోమీటర్ల రైల్వే లైన్ల విద్యుదీకరణ : పీయుష్‌ గోయల్‌

18వేల కిలోమీటర్ల రైల్వే లైన్ల విద్యుదీకరణ : పీయుష్‌ గోయల్‌

న్యూఢిల్లీ :  2014-20 మధ్య 18,065 కిలోమీటర్ల రైల్వేలైన్లను విద్యుదీకరించామని, అంతకు ముందు ఆరు సంవత్సరాలతో పోల్చితే వృద్ధి వేగం 371 శాతమని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ ఆదివారం అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి అనేక మైలురాళ్లు సాధించిందన్నారు. 2014-20లో 18,065 కిలోమీటర్ల రైల్వేలైన్‌లో విద్యుత్‌ లైన్లు వేస్తే, 2008 - 2014 మధ్యకాలంలో 3,835 కిలోమీటర్లు మాత్రమే అభివృద్ధి చేశారని ట్వీట్‌ చేశారు. 2019 - 2024 మధ్య 28,143 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను విద్యుదీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందని, ఇందులో 5,642 కిలోమీటర్లు ఇప్పటికే అక్టోబర్ 2020 వరకు పూర్తి చేశామన్నారు. రైల్వే మంత్రిత్వశాఖ ప్రకారం.. అజ్మీర్‌ నుంచి ఢిల్లీ మార్గం క్లిష్టమైన విభాగం. దిగ్వాడ-బండికుయ్‌ విద్యుత్‌ లైన్లు వేశారు. జాతీయ రాజధాని ప్రాంతానికి డీజిల్‌ నుంచి విముక్తి కల్పించే ముఖ్యమైన దశ అని, ఇది నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లో పరిశుభ్రమైన, పచ్చటి వాతావరణాన్ని కల్పించడంలో దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.