మంగళవారం 14 జూలై 2020
National - Jun 15, 2020 , 19:29:07

కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డ వలస కూలీలు

 కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డ వలస కూలీలు

లక్నో : కరోనా సంక్షోభం నుంచి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా 16లక్షల మంది వలస కూలీలు బయటపడ్డారని ఆశవర్కర్ల సర్వేలో తేలిందని ఆ రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ అమిత్‌ మోహన్‌ సోమవారం తెలిపారు. సుమారు 1,455మందిలో మాత్రమే వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు  16,46,312మంది వలస కూలీలను ఆశవర్కర్లు సర్వే చేయగా ఈ విషయం స్పష్టమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 12,088 కరోనా కేసులు నమోదుకాగా వీరిలో 7,292మందరి చికిత్సకు కోలున్నారని, 345మంది మృతి చెందినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ తన నివేదికలో వెల్లడించింది.


logo