మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 01:59:58

కరోనా నుంచి 70 శాతం మంది రికవరీ

కరోనా నుంచి  70 శాతం మంది రికవరీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటి వరకు 15,83,489 మంది కోలుకున్నారు. దీంతో రికవరీరేటు దాదాపు 70 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో కరోనా మరణాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో మరణాల రేటు 1.99 శాతంగా ఉన్నది. ప్రస్తుతం 6,39,929 మంది చికిత్స పొందుతున్నారు. 

భారత్‌లోనే వేగంగా కేసుల నమోదు

ప్రపంచంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న తొలి రెండు దేశాలైన అమెరికా, బ్రెజిల్‌ కన్నా భారత్‌లోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు ఈ మూడు దేశాల్లో నమోదైన కేసులను పరిశీలిస్తే.. భారత్‌లో 4,11,379 కేసులు వెలుగుచూశాయి. అమెరికాలో 3,69,575 కేసులు నమోదుకాగా.. బ్రెజిల్‌లో 3,04,535 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భయపడవద్దని కేంద్రం రాష్ర్టాలకు సూచించింది.


logo