బుధవారం 03 జూన్ 2020
National - Apr 02, 2020 , 15:52:58

‘తబ్లిగీ జమాత్‌లో పాల్గొన్నవారికి పరీక్షలు నిర్వహిస్తున్నాం’

‘తబ్లిగీ జమాత్‌లో పాల్గొన్నవారికి పరీక్షలు నిర్వహిస్తున్నాం’

హైదరాబాద్‌: మర్కజ్‌ హౌజ్‌లో తబ్లిగీ జమాత్‌ నిర్వహించిన కార్యక్రమంలో మహారాష్ట్ర నుంచి 1400 మంది పాల్గొన్నారని, వారిలో సుమారు 1300 మందిని గుర్తించామన్నారు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోప్‌. వారికి ప్రస్తుతం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. మర్కజ్‌ సామూహిక ప్రార్థనల తర్వాత దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో ప్రభుత్వాలు ఆ ప్రార్థనల్లో ఎంతమంది పాల్గొన్నారు, వారి వల్ల ఈ వైరస్‌ ఎంతమందికి సోకిందని ఆదోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక నుంచి పాల్గొన్న 391 మందిని క్వారంటైన్‌ తరలించారు.


logo