సోమవారం 13 జూలై 2020
National - May 28, 2020 , 20:16:06

అహ్మదాబాద్‌లో రెండు నెలల్లో 100 మంది వైద్యులకు కరోనా

అహ్మదాబాద్‌లో రెండు నెలల్లో 100 మంది వైద్యులకు కరోనా

అహ్మదాబాద్: గత రెండు నెలల్లో అహ్మదాబాద్‌ నగరంలో 100 మందికి పైగా వైద్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు గుజరాత్‌లోని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) కార్యాలయ అధికారులు తెలిపారు. వారిలో చాలా మందికి ఇప్పటికే కోలుకుని డిశ్చార్జ్‌ అవ్వగా మరికొందరు ఇంకా చికిత్స పొందుతున్నారని ఐఎంఎ గుజరాత్‌ కార్యదర్శి డాక్టర్‌ కమలేష్‌ సైనీ తెలిపారు. నగరానికి చెందిన ప్రఖ్యాత ఆర్థోపెడిక్‌ సర్జన్‌ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురైందని ఆయన చెప్పారు.

పాజిటివ్‌ పాజిటివ్‌ వచ్చిన వారిలో సీనియర్‌ వైద్యులు కూడా ఉన్నారు. బీజే మెడికల్‌ కాలేజీ మాజీ డీన్‌కు కూడా కరోనావైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని సైని చెప్పారు. కరోనా సోకిన వైద్యుల సంఖ్య 100 కంటే ఎక్కువ ఉండొచ్చు అన్నారు. ఎందుకంటే వారిలో చాలామంది కరోనా టెస్టులకు ముందుకు రాలేదు, వారికి కరోనా సోకినా అసోసియేషన్‌కు సమాచారం ఇవ్వలేదని ఆయన చెప్పారు.

వైద్యులు కాకుండా, పోలీసులు, ఇతర సిబ్బంది, పేదలకు రేషన్‌ పంపిణీలో పాల్గొన్న ప్రభుత్వ సిబ్బంది, ఉపాధ్యాయులకు కూడా కరోనా వైరస్‌ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అహ్మదాబాద్‌ జిల్లాలో కరోనావైరస్‌ సంఖ్య బుధవారం 11,000 మార్కును దాటింది, మరణాల సంఖ్య 764 కు పెరిగింది.


logo