శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 13:44:09

దేశంలోనే తొలిసారి..24 గంటల్లో లక్షకు పైగా టెస్టులు

దేశంలోనే తొలిసారి..24 గంటల్లో లక్షకు పైగా టెస్టులు

లక్నో:  దేశంలో 24 గంటల్లో  అత్యధిక కరోనా టెస్టులు చేసిన రాష్ట్రంగా  ఉత్తర్‌ప్రదేశ్‌ నిలిచింది.  యూపీలో  సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో  1.06లక్షల  కోవిడ్‌-19 నమూనాలను పరీక్షించారు.  24 గంటల్లో   3,578 మందికి కరోనా పాజిటివ్‌గా   నిర్ధారణ అయింది. ఒక్క రోజులో ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి.   దేశంలో కరోనా వైరస్‌ ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా   ఒకేరోజు ఇంత  భారీ స్థాయిలో యూపీలో  పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. 

ఒక రోజులో లక్ష పరీక్షలు  నిర్వహించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వైద్యశాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కరోనా టెస్టింగ్‌ కెపాసిటీ పెంచాలని  అధికారులను  ఆదేశించారు.  'ఆదివారం రాష్ట్రంలో  1,06,962 కరోనా పరీక్షలు నిర్వహించాం. దేశంలో ఒక రాష్ట్రంలో ఈ స్థాయిలో టెస్టులు చేయడం ఇదే  అత్యధికం.  ఇప్పటి వరకు 19,41,259 నమూనాలు పరీక్షించామని' అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ అమిత్‌ మోహన్‌ వెల్లడించారు. 


logo